Site icon NTV Telugu

థర్డ్‌ వేవ్‌ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

YS Jagan

అమరావతి : కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్‌ వేవ్‌ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్‌ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వామ్యం చేయాలని.. అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలని తెలిపారు.

read also : టీపీసీసీ ఇక…తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ : వైసీపీ ఎంపీ

దీనికి అనుగుణంగా వ్యవస్థను బలోపేతం చేయాలని.. కోవిడ్‌ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. సీజనల్‌ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్‌ ద్వారా సేవలు అందాలని… విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా వ్యవహరించాలన్నారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలని… ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్‌ రెండూ ఉండేటట్లు రన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌.

Exit mobile version