నిరుద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు ఊరట నిచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు జగన్. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేస్తున్నారు అధికారులు.
ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యం అన్నారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి.
గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 1998, 2008 DSC వారికి న్యాయం చేయలేదు. 2008 డీఎస్సీ వారికి కూడా సీఎం జగనే న్యాయం చేశారు. 4565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి…విధివిధానాలు రూపొందిస్తున్నారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి వెల్లడించారు. సీఎం నిర్ణయం మేరకు వారికి ఉద్యోగ నియమాకాలు జరగనున్నాయి.