CM Jagan Financial Help To Volunteer: ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో వారిని ఆదుకుంటారు. ఆర్థిక చేయూతని అందిస్తారు. ఇప్పుడు మరోసారి ఆయన తన మంచి మనసుని చాటుకున్నారు. రెండు కిడ్నీలు పాడైన వాలంటీర్‌కు ఆర్థిక చేయూతనందించారు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్ సచివాలయం వాలంటీర్‌కు రెండు కిడ్నీలు పాడయ్యాయి. వాలంటీర్లకు వందనం కార్యక్రమం సందర్భంగా.. తమను ఆదుకోవాలని వాలంటీర్ సోంబాబు, ఆయన తల్లి సీఎం జగన్‌ని కోరారు. ఆయన వెంటనే స్పందించారు. తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
అంతేకాదు.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కూడా సీఎం జగన్ ప్రకటించారు. అలాగే.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.10వేల పెన్షన్ కూడా అందించాలని అధికారులకు ఆదేశించారు. మూత్రపిండాల మార్పిడికి అవసరమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. మూత్రపిండాల మార్పిడికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి సీఎం హామీ ఇచ్చారు. సీఎం జగన్ చేసిన ఈ సహాయాన్ని తన జీవితంలో మర్చిపోలేనని సోంబాబు హర్షం వ్యక్తం చేశాడు. అటు.. సీఎం ఆదేశాల మేరకు, గంట వ్యవధిలోనే సోంబాబుకు రెండు లక్షల రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు.
Adimulapu Suresh: శవాలపై రాజకీయం చేయడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య