NTV Telugu Site icon

ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్‌ పర్యటన నేటితో ముగిసింది. కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్, ధర్మేంధ్ర ప్రధాన్‌లతో సమావేశమైన సీఎం వైయస్‌.జగన్‌ రాష్ర్టంలో నెలకొన్న సమస్యలు, విభజన హామీల అమలుపై కేంద్ర మంత్రులతో చర్చించారు. సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌. ఉదయం కేంద్ర మంత్రి నితిన గడ్కరీతో సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. ఆర్బీకేలద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పంచే విషయంలో సమాచార ప్రసార శాఖ సహాయ సహకారాలు కోరిన సీఎం. రాష్ట్రంలో క్రీడా సముదాయాల అభివృద్ధిపై చర్చించారు. తర్వాత కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన సీఎం జగన్‌.

Read Also: బండి సంజయ్‌ భయపడే వ్యక్తి కాదు: సోము వీర్రాజు

గిరిజన విశ్వవిద్యాలయం స్థలం మార్పిడికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే మొదలుపెట్టాలని ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన కేంద్ర మంత్రి కి వివరించిన సీఎం జగన్‌. నైప్యణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. ఇప్పటికే చాలా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లో కొనసాగుతున్న విషయాన్ని వివరించారు. కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన అనంతరం ఈ సాయంత్రం తాడేపల్లిలోని నివాసానికి ముఖ్యమంత్రి జగన్‌ చేరుకున్నారు.