బండి సంజయ్‌ భయపడే వ్యక్తి కాదు: సోము వీర్రాజు

బండి సంజయ్‌ అరెస్టుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇవాళ సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ర్యాలీ చేపట్టేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సైతం వచ్చారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశంపై కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఈ అంశంపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also:చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉరుకోం: మంత్రి అప్పలరాజు

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఇది కరోనా కట్టడా..? కక్ష సాధింపు చర్యనా..? నల్గొండలో కేటీఆర్‌ బైక్‌ ర్యాలీ చేస్తే కరోనా రాదు. ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం సంజయ్‌ శాంతియుత నిరసన తెలిపితే గుర్తొస్తుందా..? నామిత్రుడు సంజయ్‌ మీ అరెస్టులకు భయపడే వ్యక్తి కాదనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ గుర్తుంచుకోవాలని అని ట్వీట్‌ చేశారు.


Related Articles

Latest Articles