Site icon NTV Telugu

CM Chandrababu: రాజధాని రైతులతో సీఎం సమావేశం.. సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం!

Cm Chandrababu

Cm Chandrababu

ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏపీ సచివాలయంలో అమరావతి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని కాన్ఫెరెన్స్ హాల్‌లో వంద మంది రైతులతో సీఎం సమావేశమవ్వనున్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. రైతుల సమావేశంలో సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులకు ప్లాట్లు కేటాయింపు, జరీబు-మెట్ట భూములు, ఎసైన్డ్ భూములకు సంబంధించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వం రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌లతో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే రెండు సార్లు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి గురువారం మరోసారి సమావేశమైంది. జరీబు-మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్‌, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కమిటీ కసరత్తు చేస్తోంది. శనివారం ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.

Exit mobile version