NTV Telugu Site icon

CM Chandrababu: వాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్..

Babu

Babu

CM Chandrababu: అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యడం ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేస్తే తప్పించుకోలేరు.. ప్రేమ పేరుతో మహిళలను ముగ్గులోకి దింపుతున్నారు.. ఇలాంటివి సహించేది లేదు.. చిన్న చిన్న అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా ఐయిపోతారు జాగ్రత్త అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

Read Also: Yamaha FZ-S Fi: హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్‌.. ధర ఎంతంటే?

ఇక, శాంతి భద్రతలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం నిరంతరం యుద్ధం చేస్తుంది.. గంజాయి పండించొద్దని గిరిజన ప్రాంతాల్లోని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా దీనిపై సమీక్ష చేయలేదన్నారు. అందుకే, విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా శాంతిభద్రతలు అదుపులో ఉండాల్సిందే.. ముఠాలు, కుమ్ములాటలను అణచి వేస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.