Site icon NTV Telugu

Chandrababu: మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..

Ap Cm

Ap Cm

Chandrababu: మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యదర్శులు అందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీలోపు ఎందుకు ఖర్చు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎరవిచ్చారు అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఫిభ్రవరి మొదటి, రెండవ వారాల్లో పెట్టి మార్చి 15వ తేదీకల్లా అంతా ముగించాలనుకుంటున్నాం.. మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే మీరు ఇలా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా మీకు.. అందరు మంత్రులు కూడా ఆలోచించాలి.. మీరు, మీ సెక్రటరీలు, విభాగ అధిపతులు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

Read Also: Sandeep: రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే ర్యాంపే.. కొరియోగ్రాఫర్ సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

అయితే, ప్రజాధనాన్ని ముగిపోయేలా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలలో ఉన్న డబ్బులు మీరు ఎందుకు ఖర్చు చేయలేదన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ. 320కోట్లు ఉంటే కేవలం రూ. 120 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఈ నెల చివరి నాటికి డబ్బులన్నీ ఖర్చు చేయాలి లేకపోతే మీ వెంటపడతామని పేర్కొన్నారు. అన్ని శాఖలతో పోల్చితే ఫైనాన్స్ ఇప్పడు బాగా చేస్తోంది.. వారే మీ వెంటపడుతున్నారు.. ఈనెలాఖరుకు కేంద్ర పథకాల డబ్బులు ఖర్చు చేసి, మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి నాలుగు డబ్బులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Exit mobile version