CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ తగ్గింపు ఫలితాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ ఉప సంఘంతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జీఎస్టీ తగ్గింపు ఫలితాలు ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని, థీమ్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే, జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనాలు ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి చేరాలి అన్నారు. పర్యాటకం, ఆక్వా, విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో ఈ మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Election Code : ఎక్కడికి ఎంత నగదు తీసుకెళ్లగలరు..? తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం
అలాగే, ప్రతి జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు నిర్వహించడం ద్వారా కూడా జీఎస్టీ తగ్గింపు యొక్క ప్రభావాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యార్థులను కూడా జీఎస్టీ తగ్గింపు సంబరాలలో భాగస్వామ్యంగా చేయాలని సూచించారు. స్టేషనరీ ధరలు గణనీయంగా తగ్గాయి.. ఈ కార్యక్రమాలు వచ్చే నెల 19 వరకు అన్ని రంగాల్లో కొనసాగించాలని పేర్కొన్నారు. పర్యాటక రంగం, ఆక్వా రంగం, విద్య, వ్యవసాయం, వైద్యం రంగాలపై జీఎస్టీ తగ్గింపు ఫలితాలు సమగ్రంగా ప్రజలకు తెలియజేయడం కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
