NTV Telugu Site icon

Chandrababu- Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్..

Telanganarains

Telanganarains

Chandrababu- Amit Shah: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సంప్రదింపులు జరుపుతూన్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులను అమిత్ షాకు వివరించగా.. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక, అమిత్ షాతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో చంద్రబాబు మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు.

Read Also: IC 814 Hijack: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’పై వివాదం..హైజాకర్లకు హిందూ పేర్లు.. అసలు నిజం ఇదే..

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా మరో 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది.. ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు.. ఇవన్నీ రేపు ( సోమవారం) ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ చెప్పారు. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు వెల్లడించారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన కేంద్ర హోం సెక్రటరీ.. సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు తెలపగా.. రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయని హోం సెక్రెటరీ వెల్లడించారు.

Show comments