Site icon NTV Telugu

Fly ash: ఫ్లైయాష్ కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

Fly Ash

Fly Ash

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఫైయాష్ కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైయాష్ కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తమలో తామే దాడులకు పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్లైయాస్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పాండ్ యాష్ ప్లాంట్ లో లోడింగ్ అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గతంలో జేసి ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఘర్షనలు చోటుచేసుకునేవి. నేడు టీడీపీ నేతల మధ్య ఘర్షన చోటు చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. ఫైయాష్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఉచితంగా వచ్చే ఫ్లైయాష్ ను అమ్ముకునేందుకు ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్యే గొడవలు తలెత్తుతున్నాయి. రామ్మోహన్ రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

Exit mobile version