కర్నూలు ఆలూరు మండలం హులేబీడు, తుమ్మల బీడు గ్రామాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహరం వేడుకల వివాదంతో ఈ ఘర్షణ జరిగింది. తుమ్మలబీడు పీరులు హులేబీడు రావడం అక్కడి ఆనవాయితీ. కానీ ఈసారి తుమ్మల బీడు స్వామి హులేబీడు కు రాకూడదని స్థానికులు ఆంక్షలు విధించారు. కానీ ఆనవాయితీ ప్రకారం తుమ్మలబీడు పీరులు హులేబీడు లోకి రావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక ఈ ఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్ లో రెండు గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేసారు.