NTV Telugu Site icon

Nadendla Manohar: గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

Nadendla

Nadendla

Nadendla Manohar: గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గంలోని పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం ఉద్దేశించిన లే అవుట్లను.. అక్కడి ఇళ్ల నిర్మాణాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్ల, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ఇక, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తాం.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామన్నారు. పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Read Also: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..

అలాగే, కొంత మంది లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదని చెప్పడంతో మంత్రి మనోహర్ విస్తుపోయారు. లబ్ధిదారులకు వారి స్థలాలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.