Site icon NTV Telugu

Sriharikota: షార్‌లో మరో విషాదం.. నిన్న భర్త.. నేడు భార్య ఆత్మహత్య

Sriharikota

Sriharikota

Sriharikota: శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. ఇప్పుడు సీఐఎస్ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి మొన్న ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.. నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చిన చింతామణి.. మొన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, మొన్న సాయంత్రం షార్‌ మొదటి గేటువద్ద కంట్రోల్‌ రూమ్‌లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్.. గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే, ఇవాళ తెల్లవారే సరికి మరో మరణవార్త వినాల్సి వచ్చింది.. ఆత్మహత్యకు పాల్పడిన సీఐఎస్ఎఫ్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌ సింగ్‌భార్య ఆత్మహత్య చేసుకుంది.. భర్త వికాస్‌ సింగ్‌ ఆత్మహత్యతో నిన్న బీహార్‌ నుంచి భర్తను చూడడానికి వచ్చిన ఆమె.. మనస్థాపానికి గురయ్యారు.. రాత్రి నర్మదా గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఆమె.. రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.. తెల్లవారే సరికి శవమై కనిపించింది.. నర్మద గెస్ట్‌ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొని నిన్న తన అన్నతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు. భర్త వికాస్‌సింగ్‌ మృతిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వికాస్‌ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇప్పుడు ఆ చిన్నారులకు తల్లిదండ్రులు లేకుండా పోయారు.. కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలిగా చెబుతున్నారు.. వికాస్‌ సింగ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతోన్న సమయంలో.. ఆయన భార్య కూడా ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది..

Exit mobile version