NTV Telugu Site icon

Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..

Nagari

Nagari

Nagari Politics: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన చేపట్టింది.. అధికారానికి దూరమైన తర్వాత.. వరుసగా అన్ని జిల్లాల్లో పార్టీపై ఫోకస్‌ పెడుతున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అందులో భాగంగా.. గురువారం రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.. అందులోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల బాధ్యతలు పెద్దిరెడ్డికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించినట్టుగా తెలుస్తుండగా.. మరోవైపు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలకు దిగింది..

Read Also: Danam Nagender: బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా..?

నగరి నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్నర కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది వైసీపీ.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు చిత్తురు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్.. ‘చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్‌ (రాష్ట్ర వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి), కేజే శాంతి (మాజీ ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌) మరియు వీరి కుటుంబ సభ్యులు.. పార్టీ సిద్ధాంతాలకు మరియు ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి వ్రాతపూర్వకమైన ఫిర్యాదు అందింది.. వారిపై పేర్కొనబడిన అభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ.. క్షమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు.. పార్టీ నుంచి తొలగిస్తూ మరియు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం.. ఇక మీదట వారి కార్యక్రమాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన ప్రకటనలో పేర్కొన్నారు చిత్తురు జిల్లా పార్టీ అధ్యక్షుడు కేఆర్‌కే భరత్.. కాగా.. మాజీ మంత్రి రోజా వ్యతిరేకవర్గంగా ముద్రపడిన నేతగా ఉన్నారు కేజే కూమార్‌‌‌.

 

Show comments