Site icon NTV Telugu

MP Midhun Reddy: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి హౌస్ అరెస్టు

Mithun Reddy

Mithun Reddy

MP Midhun Reddy: తిరుపతి జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమైయ్యారు. అయితే, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పర్యటనకు వెళ్తే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పుంగనూరు రాకుండా టీడీపీ ఇన్ చార్జ్ చల్లా బాబు అడ్డుకున్నారు. ఇక, రెండు రోజుల క్రితం 13 మంది పుంగనూరు కౌన్సిలర్లు సహా ఛైర్మన్‌ రాజీనామా చేసి చల్లా బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, పోలీసులు పుంగనూర్ లో ఎలాంటి అల్లర్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎవరన్న గొడవలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ చేయడంతో పాటు ఆయన ఇంటి చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎంపీ ఇంటి సమీపంలో వైపుకు ఎవర్ని కూడా అనుమతించడం లేదు పోలీసులు.

Exit mobile version