Chittoor Police: రేపు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పుంగనూరు మండలంలోని బండ్లపల్లి టోల్ ప్లాజా దగ్గర సీఐ సుబ్బరాయుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.. పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని సీఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు.
Read Also: Off The Record: ఆ ఏపీ మంత్రి మీద సీఎంవో స్పెషల్ నిఘా పెట్టిందా..?
కాగా, ఇప్పటికే జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే.. కొంతమంది జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు.. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నారు.. ఆటోల ద్వారా జనాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారిపై సాక్ష్యాదారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ తెలిపారు.