YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి.. ఇప్పటికే అనేకమంది రైతులను వైఎస్ జగన్ కలసి వారి కష్టాలు తెలుసుకున్నారు అని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
Read Also: Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
ఇక, చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారు లేరు.. తూతూ మంత్రంగా ప్రభుత్వం రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించింది.. రైతులు మామిడికాయలు రోడ్డు పక్కన పడేసే పరిస్థితి వచ్చింది.. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టమాటో రైతులు చూశారని తెలిపారు పెద్దిరెడ్డి.. నా జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్న ఆయన.. ఫ్యాక్టరీలు గత ఏడాది పల్ప్ నే ఇంకా విక్రయించని పరిస్థితి… అనేకమంది.. గతంలో కాంగ్రెస్, వైసీపీ కాంగ్రెస్ రైతులకు మద్దతు ధర దొరకనప్పుడు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు.. పల్ప్ సిండికేట్ నా పని అంటూ నా పై విష ప్రచారం చేస్తున్నారు.. అలాంటప్పుడు నా పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా.. నా పైన విమర్శలు చేయడం అలవాటే అంటూ దుయ్యబట్టారు పెద్దిరెడ్డి..
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
మరోవైపు, పల్ప్ ఫ్యాక్టరీలు 90 శాతం టీడీపీ వారివి ఉంటే… టీడీపీ వారు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుంది అని వెల్లడించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
