Wives Fight: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. చిత్తూరు కండ్రిగకు చెందిన విశ్రాంత ట్రాన్స్‌కో డీఈ సుబ్రహ్మణ్యం గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండగా.. ఇటీవల పరిస్థితి విషమించడంతో రెండో భార్య జానకి, తనయుడు నవీన్ కుమార్ స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ఇక, చికిత్స పొందుతూ బుధవారం నాడు మృతి చెందాడు. అయితే, తిరుపతిలో ఉంటున్న మొదటి భార్య పద్మ, ఆమె కుమారుడు రవి అక్కడికి చేరుకున్నారు. స్విమ్స్ అధికారులను సంప్రదించి తాను మొదటి భార్యని, మృతదేహాన్ని తమకే అప్పగించాలని కోరింది.
Read Also: Gannavaram Airport: గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు.. గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం
అయితే, అక్కడే ఉన్న రెండో భార్య కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న తిరుపతి పడమర పోలీస్ స్టేషన్ సీఐ మురళీ మోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన చేసే వారికి సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇక, ఇద్దరు చర్చించుకుని వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.