Site icon NTV Telugu

Chittoor Crime: బెదిరించాలని అనుకున్నాడు.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు..

Chitoor Crime

Chitoor Crime

Chittoor Crime: కొందరు చేసే తెలివితక్కువ పనులకు వారే బలవుతుంటారు. ఏదో చేద్దామని ప్లాన్‌ వేసుకుని చివరికి ఆ ఉచ్చులో వారేపడి గిల గిల కొట్టుకుంటుంటారు. ఇలాంటివి మనం టిక్‌, సోషల్‌ మీడియాలో కూడా లైవ్‌ వీడియోలు కూడా చూస్తుంటాము కానీ.. అయితే ఇక్కడ నేను చెప్పే వ్యక్తి కూడా అలాంటివాడే. ఒక వ్యక్తి చేసిన పని తన ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తాను కుటుంబాన్ని బెదిరిద్దామని మరణించినట్లు ఫోటో తీద్దామని అనుకుంటే.. అతను వేసిన ప్లాన్‌ అతనికే బెడిసికొట్టంది. చివరకు అతను తనువు చాలించాడు. ఈఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. పాల్గొననున్న ఎమ్మెల్యే సీతక్క

చిత్తూరు జిల్లాలో లోకేష్ అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తుంటారు. లోకేష్ తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన వ్యక్తి. తమిళనాడులోని ఇంటికి అప్పులిచిన వారి బెడదతో లోకేష్ కు పిల్లనిచ్చిన మామ ఫోన్ చేసి మందలించాడు. ఇదే విషయాన్ని తన భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు లోకేష్‌. అయితే భార్య కూడా మందలించడంతో.. లోకేష్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మామ,భార్యను బెదిరించాలని తనను తాను ఉరివేసుకునే విధంగా ఫోటో తీసి పంపుదామనుకున్నాడు. ఇలా బెదిరిస్తే తనను ఇంకోసారి ఫోన్‌లో అలా మాట్లాడరని, బతిమలాడుతారని ఊహించుకున్నాడు. అయితే చనిపోతున్నట్లుగా ఫోటో తీద్దామని తను పనిచేస్తు్న్న చోటే పైన ఉన్న కడ్డీకి తాడు వేసాడు ఎదురుగా ఫోన్‌ పెట్టుకుని ఉరివేసుకున్నట్లుగా తాడును తన మెడకు బిగించుకున్నాడు. అయితే ఆతాడు గొంతులో కట్టగా బెడిసికొట్టి నిజంగా ఉరిపడిపోయిది. లోకేష్‌ ఊపిరాడక చనిపోయాడు. లోకేష్‌ ఉన్న ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో అతన్ని కాపాడేందుకు వీలు లేకుండా పోయింది. అయితే అక్కడకు వచ్చిన మరో వ్యక్తి యజమానికి ఫోన్‌ చేసి చెప్పగా..ఇంటి యజమాని పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతనే ఉరి వేసుకున్నాడా? లేక ఎవరైనా చంపేసి ఉరివేసి ఇలా చిత్రీకరిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Orange: ప్రేమ కొంత కాలమే బాగుంటుంది… ఈ ట్రైలర్ మాత్రం ఇప్పటికీ బాగుంది

Exit mobile version