NTV Telugu Site icon

Srikalahasti Video Record: శ్రీకాళహస్తిలో దారుణం.. భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్

Bathroom Video

Bathroom Video

Room Boy Tried To Take Bathroom Video Of Girl In Srikalahasti Lodge: మొబైల్ ఫోన్ ఉన్నది.. అత్యవసరమైన సమయంలో దూరప్రాంతాల్లో ఉన్నవారితో కాంటాక్ట్ అవ్వడం కోసం. ఇక స్మార్ట్‌ఫోన్స్ అయితే, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వినియోగపడతాయి. కానీ.. నేటి తరం యువత మాత్రం వీటిని దుర్వినియోగపరచుకుంటున్నారు. తమ ఎదుగుదల కోసం ఈ టెక్నాలజీని వాడకుండా, పాడు పనులకు ఉపయోగిస్తున్నారు. తమ పైశాచికత్వం ప్రదర్శిస్తూ.. ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసభ్యకరమైన పనులకు పాల్పడటం, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాంటి పాడుపనే చేశాడు. ఓ భక్తురాలి ప్రైవేట్ వీడియో తీస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. స్వామివారం దర్శనం కోసం శ్రీకాళహస్తికి తన కుటుంబ సభ్యులతో వచ్చింది. స్థానిక మయూర లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుంది. ఇక దర్శనం కోసం తయారవుదామని, బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లింది. ఆమె స్నానం చేస్తుండగా.. ఎవరో వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఆమెకు కనిపించింది. దీంతో వెంటనే కేకలు వేసింది. ఏం జరిగిందని ఆరా తీయగా.. ఎవరో తన బాత్రూం వీడియో తీస్తున్నారని తెలిపింది. దీంతో.. వెంటనే రంగంలోకి దిగి, సురేష్ అనే యువకుడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడు చేసిన పాడుపనికి స్థానికులు అతనికి తగిన బుద్ధి చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చి, అతడ్ని వారికి అప్పగించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రూమ్ బాయ్‌గా పని చేస్తున్న సురేష్.. తోట్టంబేడు మండలం రౌతుసురమాలవాసిగా గుర్తించారు.

Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం