RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..

Roja

Roja

RK Roja: మంత్రి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్‌ రైజింగ్‌ స్టార్‌ కాదని.. స్కామ్‌ స్టార్‌ అని విమర్శించారు. అవినీతిలో రైజింగ్‌ స్టార్‌గా ఎదిగారని మండిపడ్డారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో సైకో పనులు చేస్తున్నారని మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును లోకేష్‌ తన అవినీతి, స్కామ్‌ల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని.. అవినీతి సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే వెళ్తున్నారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించిన రోజా..

ఇక, పేకాట ఆడేవారికి కూడా డీఎస్సీ ద్వారా ఉద్యోగం ఇచ్చారన్నారు రోజా.. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన ఆమె.. మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కూడా వ్యాఖ్యానించారు.. విద్యార్థుల తరఫున తాము ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించారని.. ఆ కేసుల్లో జగన్‌కు క్లీన్‌చిట్‌ వచ్చిందని మరి లోకేష్‌పై ఆరోపణల విషయంలో చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. లోకేష్‌పై నమ్మకం లేకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారన్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆర్కే రోజా..