Site icon NTV Telugu

Manchu Mohan Babu: మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట

Mohanbabu

Mohanbabu

Manchu Mohan Babu: ఓవైపు కుటుంబ వ్యవహారాలు.. మరోవైపు కేసులతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు సతమతం అవుతున్నారు.. హైదరాబాద్‌ జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్‌ పోలీసులు.. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. ఇక, మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు.. ఈ నెల 9వ తేదీన మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుల పై దాడి జరగగా.. జర్నలిస్టుల ఫిర్యాదుతో పీఆర్వో సతీష్ తో పాటు మరికొందరి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు వారికి ఊరట కలిగిస్తూ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు..

Read Also: Manipur: మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..

Exit mobile version