NTV Telugu Site icon

Chittoor: కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌.. నలుగురు మృతి

Online Betting

Online Betting

కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా వేదికగా ఎందరో ఆన్‌లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలైంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత‌ మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ కుమారుడు దినేష్ సైతం మృతి చెందాడు. రెండు రోజుల సమయంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో గ్రామం తీవ్ర విషాదం నెలకొంది.

Show comments