NTV Telugu Site icon

Nara Bhuvaneswari: ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు’.. భువనేశ్వరి నోట బాలయ్య డైలాగ్..

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే.. యాక్షన్‌.. డైలాగ్స్‌.. ఏ సినిమాలోనైనా.. బాలయ్య మార్క్‌ డైలాడ్స్‌ ఉండాల్సిందే.. ఇప్పుడు బాలయ్య డైలాగ్‌.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి నోటా వచ్చింది.. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుండగా.. అందులో భాగంగా ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా అనేక విషయాలపై బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే మాటలు చెప్పారు.. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి అని తెలిపారు.. మన ధైర్యం మనకుండాలని సూచించారు నారా భువనేవ్వరి..

Read Also: Mahesh Kumar Goud: అంబేద్కర్ మాకు దేవుడు లెక్క.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి: పీసీసీ చీఫ్‌

ఇక, ముందు నందమూరి కుమార్తెను.. చంద్రబాబు భార్య సెకండ్.. కానీ, ఒక మహిళగా నేనేమిటి అనేది నాకు తెలుసు అన్నారు భువనేశ్వరి.. మనందరిలోనూ ఆ శక్తి ఉంది. ఫోకస్ పనిలోపెడితే ముందుకు వెళ్ళచ్చు అన్నారు.. హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టాలి.. నాన్నకంటే గొప్పవాడివి కావాలి.. చేయకపోతే నీ ఫ్యూచర్ ఆగుతుంది అని నా కుమారునికి చెప్పాను అను గుర్తుచేసుకున్నారు.. మీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది.. ఎవరూ రారు.. బద్ధకం ఉంటే జీవితంలో ఎడగలేరు అని హెచ్చరించారు.. అయితే, ఈ కార్యక్రమంలో తన సోదరుడు బాలయ్య డైలాగ్‌ను అదరగొట్టారు నారా భువనేశ్వరి.. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని.. కానీ, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దవారని తెలిపారు.. తాను సినిమాలు తక్కువగా చూస్తాను.. కానీ, నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయి అని పేర్కొన్నారు.. ఇక, విద్యార్థుల కోరిక మేరకు ‘ఒకవైపే చూడు మరోవైపు చూడకు..’ అంటూ బాలయ్య డైలాగ్ ను చెప్పారు నారా భువనేశ్వరి.. కాగా, బాలయ్య నటించిన సింహా సినిమాలోని ఈ డైలాగ్‌ ఎంతో ఆదరణ పొందిన విషయం విదితమే..