NTV Telugu Site icon

Madanapalle Sub Collector Office Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో కీలక పరిణామం..

Madanapalle Sub Collector

Madanapalle Sub Collector

Madanapalle Sub Collector Office Case: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఘటనపై 4 బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించి ఆరా తీస్తున్నారు. గత ఆరు రోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీవో హరిప్రసాద్‌, మాజీ ఆర్డీవో మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌, వీఆర్‌ఏ రమణయ్య ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది, అనుమానితుల కాల్‌ డేటాను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న మాధవరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఫొరెన్సిక్‌ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని దర్యాప్తు బృందం చెబుతోంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైనా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడుతుందని చెబుతున్నారు. ఇక, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. జిల్లా ఎస్పీ ఆధ్వర్యం లో DSP కార్యాలయంలో ఆరో రోజు కొనసాగుతుండగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జింకా వెంకటా చలపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరో అనుచరుడు బాబ్జాన్ ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు..

Read Also: Kamala Harris: డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఫిక్స్..!

మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. మంటల్లో దగ్ధమైన రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులను పరిశీలించారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీహోల్డ్‌ అవుతాయనే అనుమానంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 21.16లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌ అయ్యాయి. అందులో 4,400 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఫ్రీహోల్డ్‌పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ ఆర్పీ సిసోడియా తెలిపారు. అంతకు ముందు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి ఆర్పీ సిసోడియా అర్జీలు స్వీకరించారు. గురువారంతో గడువు ముగిసినప్పటికీ కొందరు పడిగాపులు కాశారు. అది చూసినా సిసోడియా.. వెళ్లబోతూ కారు ఆపి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అన్నింటినీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.