Kanipakam Temple: కాణిపాకం దేవాలయం దక్షిణ భారతదేశంలో సందర్శించాల్సిన ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా చెబుతారు.. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీదేవికి ఇష్ట కుమారుడై గణేశుడికి అంకితం చేయబడింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పురాతన దేవాలయం.. ఇక్కడ స్వయంభువుగా గణేశుడు వెలిశారని ప్రసిద్ధి.. ఇక్కడ వినాయకుని విగ్రహం ఎల్లప్పుడూ నీటిలో ఉంటూ, రోజురోజుకీ పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం.. అయితే, కాణిపాకం ఆలయంలో అపచారం చోటు చేసుకుంది.. పాడైన పాలతో వినాయకుడికి అభిషేకం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.. ఆలయంలో పాడైన పాలను భక్తులకు విక్రయిస్తున్నాడు కాంట్రాక్టర్.. దీంతో, కాంట్రాక్టర్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. దీనిపై సదరు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించిన ఉపయోగం లేకపోగా.. ఇక, భక్తులకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాణిపాకం గణపతి ఆలయానికి వచ్చిన భక్తులు..
Read Also: UP: లక్నోలో దారుణం.. మహిళా ఉద్యోగినిపై లులు మాల్ మేనేజర్ అత్యాచారం
