Site icon NTV Telugu

Ganja Batch: టెంపుల్ సిటీలో మరోసారి రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్‌..

Tirupati

Tirupati

Ganja Batch: టెంపుల్ సిటీ తిరుపతిలో గంజాయి బ్యాచ్ లో మరోసారి రెచ్చిపోయింది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌, గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతోంది.. ఇక, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో గంజాయి కేసుల విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు.. అయినా.. చాప కింద నీరుల తిరుపతి రూరల్ ప్రాంతంలో గంజాయి సేవించిన యువత.. మత్తులో స్థానికులపై వరుసగా దాడులకు పాల్పడితున్నారు.. ఈ వరుస ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. ఓటేరు, తిరుచానూరు సమీపంలో అలా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్దానికులు‌..

Read Also: Bomb Threat: ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. విమానంలో 189 మంది ప్రయాణికులు

తిరుపతి సమీపంలోని ఓటేరులో రెచ్చిపోతుంది గంజాయి బ్యాచ్.. రైల్వే ఉద్యోగి వాసుదేవనాయుడు ఇంటి తలుపులు కొట్టి ఆయన భార్య చైతన్య పై దాడి చేశారు.. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది.. 2 రోజుల వ్యవధిలో చంద్రబాబు దంపతులు, రిటైర్డ్ ఎస్ఐ వెంకటర్రామరాజులపై కూడా దాడి జరిగింది.. అంతకు ముందు శ్రీవారి నగర్ లో భార్యా పిల్లలతో కలిసి టీటీడీ ఉద్యోగి ధర్మేంద్ర వాకింగ్ చేస్తుండగా కూడా ఇలాంటి దాడే చేశారు.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ కుటుంబం బెంగళూరుకు మకాం మార్చినట్టుగా తెలుస్తోంది.. ఇప్పుటికే ఐదు కుటుంబాలు.. గంజాయి బ్యాచ్ ఆగడాలతో వలస వెళ్లినట్లు సమాచారం.. పోలీసులు జోక్యం చేసుకుని గంజాయి బ్యాచ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు..

Exit mobile version