Second Marriage: తిరుమలలో రోండోవ పెళ్లికి సిద్దపడిన భర్తను అడ్డుకుంది వరంగల్ కి చెందిన సంధ్య అనే మహిళ.. విడాకులు తీసుకోకూండానే రెండో పెళ్లి చేసుకుంటున్న భర్త రాకేష్ పై పోలీసులుకు పిర్యాదు చేసింది భార్య సంధ్య. దీంతో.. పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు పోలీసులు.. ఇక ఊహించని ఘటనతో షాక్ తిన్న భర్త రాకేష్.. అక్కడ నుంచి సైలెంట్‌గా జారుకుని పరారైయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: CMR Shopping Mall: సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన పాయల్ రాజ్పుత్..
కాగా, వరంగల్ జిల్లా హన్మకొండకి చెందిన రాకేష్, సంధ్యకు 2016లో వివాహం జరిగింది.. కానీ, 2017లో వారి మధ్య విభేధాలు రావడంతో.. విడిపోయారు.. దీనికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుంది.. అయితే, ఎవరికి తెలియకుండా రాకేష్ గుట్టుగా తిరుమలలో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం సంధ్యకు తెలిసింది.. దీంతో.. పోలీసులను ఆశ్రయించింది.. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి జరుగుతున్న మఠానికి చేరుకోగా.. అప్పటికే రాకేష్ అక్కడి నుంచి పరారైన్నట్లు గుర్తించారు పోలీసులు. సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.