Elephants: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు.. పుంగనూరు నుండి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు.. పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.. ఏకంగా 15 ఏనుగులు గుంపు మామితోటలను ధ్వంసం చేసింది..
Read Also: Indi vs Canada: భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన కెనడా..?
అయితే, మామిడి తోపు యజమాని రాజారెడ్డిని తొక్కి చంపేశాయి ఏనుగులు గుంపు. దీంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరోవైపు ఏనుగుల గుంపు సృష్టించిన విధ్వంసంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు.. ఇక, ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు ఫారెస్ట్ అధికారులు.. కాగా, ఇప్పటికే ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించిన విషయం విదితమే.. దీనిపై ఏపీ-కర్ణాటక మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి.. చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదని పవన్ కల్యాణ్ వెల్లడించిన విషయం విదితమే.. 1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం.. 2. మావటీలకు కావటీలకు శిక్షణ.. 3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు.. 4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం.. 5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్.. 6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది..