Site icon NTV Telugu

Deputy CM Pawan: నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ ( నవంబర్ 9న) ఉదయం పలమనేరు సమీపంలోని ముసలి మడుగు కుంకీ ఏనుగుల క్యాంపుకు వెళ్లనున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 10.35 గంటలకు పెంగరగుంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఆయన చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి 10.50గంటలకు వెళ్లనున్నారు.

Read Also: Off The Record : పోలింగ్ పూజకు ముందు ఓటర్ దేవుడిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమమా?

ఇక, కుంకీ ఏనుగుల శిబిరాన్ని, గజారామాన్ని, నగరవనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. ఇక, మధ్యాహ్నం 12.45గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం నాడు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, పలమనేరు ఆర్డీవో భవాని, సబ్‌ డీఎఫ్‌వో వేణుగోపాల్‌, రేంజర్‌ నారాయణ ఏర్పాట్ల గురించి కలెక్టర్‌కు పూర్తిగా వివరించారు.

Exit mobile version