ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.. ఇప్పటికే ఉచిత సిలెండర్లు అందిస్తున్నాం.. వీలైనంత త్వరలోనే ఇంటింటికి సీఎన్జీ గ్యాస్ అందిస్తామని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో మనం ఇస్తున్న స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదు.. కొన్ని రాష్ట్రాల్లో ఇందులో సగం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్ (పి – 4)అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నామనిన చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతటి ఆస్తి ఉన్నట్లు.. భూమి ఆస్తి కాదు.. అందుకే పిల్లలని కనమని చెబుతున్నానని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఉగాది లోపు నారావారి పల్లెలో అన్ని ఇళ్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు తెలిపారు.
Read Also: Prabhala Theertham: కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల ఉత్సవం ప్రారంభం..
మరోవైపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రపంచం మొత్తం ప్రకృతి సేద్యం వైపే చూస్తోంది.. ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌లోనే ఎరువులు అందించే టెక్నాలజీలు వచ్చాయి.. వ్యవసాయంలో డ్రోన్లను విరివిగా ఉపయోగించాలని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ సాగును మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యవయసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.. పండ్ల తోటలు, పూల పెంపకం పెరిగిందని పేర్కొన్నారు. వరి, చెరకు వంటి వాటిలో 2 శాతం ఆదాయమే వస్తుంది.. డెయిరీలో 1 శాతం ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ఇదిలా ఉంటే… కుప్పం నియోజకవర్గాన్ని మోడల్‌గా తయారు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలలో మోసం జరగకుండా టెక్నాలజీని వినియోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
Read Also: ESIC IMO Recruitment 2025: ఈఎస్ఐసీలో 608 జాబ్స్.. తక్కువ కాంపిటిషన్.. నెలకు రూ. 56 వేల జీతం