Site icon NTV Telugu

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం.. ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్..?

Narayana

Narayana

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణస్వామిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చినా, విచారణకు హాజరుకాలేదు. దీంతో పుత్తూరులోని ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ప్రస్తుతం నారాయణస్వామిని ఇంట్లోనే విచారణ చేస్తుండగా, ఏ క్షణంలోనైనా అతడ్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్ బృందాలు విచారణ జరుపుతున్నాయి.

Read Also: Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు

కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో చేసిన మార్పులు, మద్యం ఆర్డర్లలో ఆన్‌లైన్ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు చేయకుండా మద్యం అమ్మకాల వెనుక ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయన్నదానిపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే, ఎక్సైజ్ పాలసీ మార్పులు, ఆ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశాలపై కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version