AP Crime: కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ.. ఎలా.. ఏ ప్లాన్‌తో డబ్బులు కొట్టేస్తారో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ భారీ మోసం చూస్తే.. అతడి కన్నింగ్ ఐడియా చూసి అంతా నోరువెల్లబెడుతున్నారు.. పెళ్లి పేరుతో ఏకంగా 28 కోట్ల రూపాయలు కొట్టేశాడో కేటుగాడు. 25 సంవత్సరాల క్రితం రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి బెంగళూరుకు చెందిన వెంకటప్ప రెడ్డితో వివాహం జరిగింది.. అయితే, నాగమణికి వెంకటప్ప రెడ్డికి ఒక మగసంతానం కాగా.. 15 సంవత్సరాల క్రితం నాగమణి కొడుకు ప్రమాదంలో మృతిచెందాడు.. ఇక, 10 ఏళ్ల క్రితం నాగమణి భర్త వెంకటప్ప రెడ్డి కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు.. భర్త, కొడుకు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన నాగమణి.. తోడు కోసం ప్రయత్నించడమే ఆమెను కష్టాల్లోకి నెట్టింది..
Read Also: ENG vs IND: ఒక్కడి వల్లే భారత్ గెలిచింది
తోడు కోసం.. భార్య చనిపోయి పిల్లలు లేని వారిని పెళ్లి చేసుకుంటానని చిత్తూరు చెందిన బ్రోకర్ జమునను ఆశ్రయించింది నాగమణి… అయితే, పెళ్లిళ్ల బ్రోకర్ జమున ద్వారా నాగమణి వివరాలు సేకరించిన బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్.. నాగమణిని ఫోన్ ద్వారా సంప్రదించాడు.. తనకు పిల్లలు లేరు.. భార్య చనిపోయినట్లు నాగమణిని నమ్మించాడు.. భార్య కరోనాతో చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ కూడా సృష్టించాడు.. దీంతో, 28 అక్టోబర్ 2022న కర్ణాటకలోని బంగారు తిరుపతి దేవాలయంలో నాగమణి-శివప్రసాద్ పెళ్లి జరిగింది.. కొన్ని రోజులు సజావుగా సాగిన కాపురంలో శివప్రసాద్ కన్నింగ్ ఐడియాను అమలు చేశాడు..
Read Also: HebahPatel : అబ్బా.. హెబ్బా.. బ్లాక్ డ్రెస్ లో ఏముందబ్బా..
తన కన్నింగ్ ఐడియాతో కొన్ని రోజుల తర్వాత 1700 కోట్ల రూపాయలు తనకు ఆర్బీఐ నుంచి వస్తుందని నాగమణిని నమ్మించాడు.. 1700 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్బీఐ ఫేక్ లెటర్ కూడా సృష్టించాడు.. అయితే, 1700 కోట్ల రూపాయలు ఆర్బీఐ విడుదల చేయాలంటే 15 కోట్ల రూపాయలు టాక్స్ రూపంలో చెల్లించాలని నాగమణిని నమ్మించాడు శివప్రసాద్., దీంతో, నాగమణి బ్యాంక్ అకౌంట్ నుండి శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలతలకు మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసింది.. అంతేకాదు.. నాగమణికి సంబంధించిన 10 కోట్లు విలువచేసే వ్యవసాయ భూమి, బెంగళూరులో 15 కోట్ల రూపాయల విలువచేసే బిల్డింగ్ కూడా అమ్మేశాడు శివప్రసాద్.. అయితే, కాలం గడిచినా ఆర్బీఐ సొమ్ము రాకపోవడంతో అనుమానం వచ్చిన నాగమణి.. ఆర్బీఐ డబ్బుల కోసం శివప్రసాద్ పలుమార్లు నిలదీసింది.. దీంతో, గత సంవత్సరం డిసెంబర్ నెలలో నాగమణి ఇంటి నుంచి శివప్రసాద్ పరారయ్యాడు.. ఇక, శివప్రసాద్ ను జాడకోసం వెతికిన నాగమణి.. బంగారు పల్లి మండలం శేషపురానికి వెళ్లింది.. శేషాపురంలో శివప్రసాద్ కు భార్య, కూతురు ఉన్నట్లు గుర్తించి షాక్ తింది.. దీంతో, తనకు న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లా ఎస్పీకి విన్నవించింది నాగమణి..
