ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతోన్న సమయంలో.. ప్రశ్నాపత్రాల లీక్ వార్తలు కలకలం రేపాయి.. వరుసగా ప్రతీ పరీక్షపై ఏదో ఒక లీక్ వార్త ఆందోళన కలిగించింది.. అయితే, టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్ కఠిన చర్యలు ప్రారంభించింది.. నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసింది.. ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది షేర్ చేసినట్టుగా గుర్తించామని చెబుతున్నారు పోలీసులు.. దీనిపై చిత్తూరు పోలీసులు నిశిత దర్యాప్తు చేపట్టారు.. ఏప్రిల్ 4న నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ సహా మరికొందరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, నారాయణ సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటాను సేకరించారు పోలీసులు.
Read Also: Minister Harish Rao: ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు రండి : మంత్రి హరీష్ రావు
ఎవరి ఆదేశాలమేరకు ఈవ్యవహారాన్ని నడిపారన్నదానిపై కూడా పోలీసులు దృష్టిసారించారు.. ఎన్నేళ్లుగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఇప్పటివరకు దర్యాప్తులో భయంకర నిజాలు వెలుగుచూసినట్టుగా చెబుతున్నారు.. తమ సంస్థలకు ర్యాంకుల కోసం నారాయణ సిబ్బంది బరితెగించారని ఆరోపిస్తున్నారు.. ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి, షేర్‌చేసి తమవారికి ఎక్కువ మార్కుల వచ్చేలా అక్రమాలకు పాల్పడినట్టు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును అల్లక్లోలం చేసే వ్యవహారాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు పూనుకుంది.. నారాయణ సిబ్బంది సహా పలువురు టీచర్లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. మరింత లోతుల్లోకి వెళ్లి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు.. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు.. నారాయణను 10వ తరగతి మాల్ ప్రాక్టీసు కేసులో అరెస్ట్ చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.