NTV Telugu Site icon

Chiranjeevi in Congress: కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. సోనియా, రాహుల్‌తో మంచి సంబంధాలు..!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi in Congress: మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. రీ ఎంట్రీ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయారు.. వరుస సినిమాలు చేస్తున్నారు.. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లలో సత్తా చాటుతోంది.. అయితే, ఆ మధ్య చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ ఓ డైలాగ్‌ ఉంది.. అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి పరిస్థితి.. ఎందుకంటే.. ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. అంతేకాదు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు.

Read Also: GST Removal on helmets: హెల్మెట్‌లపై జీఎస్టీ వద్దు.. తొలగించండి..

ఒంగోలులో నిన్న మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని తెలిపారు.. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని వెల్లడించారు గిడుగు రుద్రరాజు.. దీంతో, మరోసారి చిరంజీవి-కాంగ్రెస్‌ చర్చ తెరపైకి వచ్చినట్టు అయ్యింది.. కాగా, రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి.. గాడ్‌ఫాదర్‌ డైలాగ్‌ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కూడా జారీ చేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. ఇక, ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూల్లో.. పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ జర్నీపై కూడా స్పందించారు.. అవసరం అయినప్పుడు తన తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి.. మరి 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.

Show comments