టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు
తన తరపున కేసులు వాదిస్తున్న న్యాయవాదికి వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారని చింతమనేని ప్రభాకర్ విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఏలూరు కోర్టులో ప్రైవేట్ కేసు పెట్టారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, రాహుల్ దేవ్ శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్‌పై అభియోగాలు దాఖలు చేశారు. తనకు వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రాణముప్పు ఉందని గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా ఫిర్యాదు చేస్తానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
