పేదోళ్ళ చెమటను జలగల్లా లాగేస్తున్నారు.. చింతమనేని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి నగర పంచాయతీల ఎన్నికలు. జిల్లాలో ఆచంట తర్వాత టెన్షన్ పెట్టిస్తోంది ఆకివీడు నగర పంచాయతీ. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు ఆకివీడుని ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటున్నాయి. ఆయా పార్టీల అగ్రశ్రేణి నేతలు నగర పంచాయతీపై ఫోకస్ పెట్టారు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు.
పేదవారి చెమటని బ్రాందీ రూపంలో లాగేసుకున్న వ్యక్తి ఈ దేశంలోఎవరూ లేరు.ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప అన్నారు. ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇంత ప్రమాదానికి దారితీస్తుందని ఎవ్వరూ ఊహించలేదన్నారు. అమ్మ ఒడి 14 వేలు ఇస్తే బాబు జేబులోంచి లక్ష రూపాయలు లాగిస్తున్నావన్నారు.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఇళ్ల స్థలాలు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న జగన్.. నీ బాత్రూమ్ ఎంత ఉందో పేదవాడికి ఇచ్చిన ఇంటి స్థలం అంత ఉందని చింతమనేని ఎద్దేవా చేశారు. కాసులకు కక్కుర్తిపడి పేద ప్రజలను మభ్య పెడతారా? ఇదేనా మీ పరిపాలన అని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!