Site icon NTV Telugu

Chicken Price : కొండెక్కిన కోడి ధర.. ట్రిపుల్ సెంచరీ..

Chicken Price Hike at Telugu States.

చికెన్‌ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్‌ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్‌ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ చికెన్‌ కిలో రూ.281లుగా విక్రయిస్తున్నారు. అయితే సరుకు తక్కువగా ఉండటం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

దీంతో పెరిగిన ధరలతో కొనేవారు లేక ఆదివారం కూడా వ్యాపారం లేదంటున్నారు చికెన్ వ్యాపారులు. పెరిగిన ధరలపై సామాన్యులు మండిపడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వంటనూనె, తదితర వస్తవులతో ధరలతో.. చికెన్ నే కాదు ఏది కొనలేని పరిస్థితి అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

https://ntvtelugu.com/kalvakuntla-kavitha-condolence-to-mall-swarajyam/
Exit mobile version