NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు..

Bhumana

Bhumana

Bhumana Karunakar Reddy: తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసినట్లు ఒక్క మాట సీబీఐ సిట్ లో రిమాండ్ లో చెప్పలేదు‌.. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టు‌లో చెప్పకోచ్చారు.. చంద్రబాబు మాత్రం లడ్డులో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసింద‌ని ప్రచారం చేశారు.. హిందూల మనోభావాలను దెబ్బ తీసేలా రాష్ట్ర మఖ్యమంత్రి మాట్లాడారు.. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో శ్యామలరావు తెలిపారు.. ఏఆర్ డైరీలో నుంచి వచ్చిన నాలుగు ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపినట్లు ఈవో చెప్పారు.. అరెస్టు అయినా నలుగురు సరఫరా వ్యవహారం తప్పులు చేశారని సిట్ చెబుతోంది అని భూమన కరుణాక్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

ఇక, ల్యాబులో ధృవీకరించిన తరువాత తిరుమలకు నెయ్యి పంపుతారు అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కల్తీ జరగకుండానే జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారు.. లడ్డు నాణ్యత పెంచడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయాని విధంగా ప్రత్యేక చర్యలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది.. సిట్ రిపొర్టులో ఎక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు‌.. పవన్ కళ్యాణ్ అయితే పవననందా స్వామీ అంటూ తిరుపతిలో సభ పెట్టి అబద్దాలు చెప్పాడు.. అయోధ్యకు లక్ష లడ్డూలు సరఫరా చేశారని పవన్ చెప్పాడు.. బురద చల్లుతాం… తుడుచుకోవాలనేలా కూటమీ ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. అసత్య ప్రచారం చేసినా కూటమి ప్రభుత్వం దేవదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు.. రాజకీయాలు పరమైన ఆరోపణలు ఏమైనా చేస్కోండి.. వెంకటేశ్వర స్వామినీ మీ రాజకీయాల కోసం వాడుకోకండి అని కోరారు. నెయ్యిలో కల్తీ జరగలేదు‌‌.. కల్తీ జరిగిందంతా పవన్, చంద్రబాబు బుద్దిలో జరిగిందన్నారు. రాజకీయాల కోసం ఆ దేవుడ్ని వాడుకోకండి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.