Site icon NTV Telugu

కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవ‌ర్టులు త‌యార‌య్యారు. పార్టీలోని కోవ‌ర్టుల‌ను ఏరిపారేస్తా. కుప్పం నుంచే పార్టీ ప్ర‌క్షాళ‌న ప్రారంభిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇక న‌న్ను మెప్పించ‌డం కాదు.. ప్ర‌జ‌ల్లో ప‌నిచేసిన వారికే గుర్తింపు. స్థానిక నేత‌ల అతి విస్వాసం వ‌ల్ల‌నే కుప్పంలో ఓట‌మి తప్పలేదు. కుప్పం స్థానిక నాయ‌క‌త్వంలో మార్పులు చెయ్యాల‌న్న‌ కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌లు అమ‌ల్లోకి తెస్తాన‌న్న చంద్ర‌బాబు… ఇక‌పై త‌రుచూ కుప్పంలో ప‌ర్య‌టిస్తానని.. కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌లు ఎక్క‌వ స‌మ‌యం ఇస్తానన్నారు. కుప్పంలో ఇల్లు నిర్మించుకుని ఎక్క‌వ స‌మ‌యం ఇవ్వాల‌న్న కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌లకు ఓకే అన్న చంద్ర‌బాబు… గ‌త ప‌ర్య‌ట‌న‌ల్లో గెస్ట్ హౌసులో క‌రెంట్ తీసెయ్య‌డం, బ‌స్సులో బ‌స చెయ్యాల్సి రావడాన్ని గుర్తు చేసారు కార్య‌క‌ర్త‌లు.

Exit mobile version