NTV Telugu Site icon

రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి ఆగింది : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పంలోని సామగుట్టపల్లెలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని, రెస్కోను డిస్కంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని మేము అంగీకరించబోమన్నారు.

అంతేకాకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ హయాంలో కట్టించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు కానీ డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థతో గ్రామాల్లో గొడవలు పెడుతున్నారని, కుప్పంను మున్సిపాలిటీగా మార్చి ప్రజల నుంచి అధికంగా పన్నులు వసూలు చేసేందుకు జగన్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు.