అనంతపురం జిల్లాలో దళితుడి ఇల్లు కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడి ఇల్లు కూల్చి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్ధం చేస్తారా అంటూ నిలదీశారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడంపై మండిపడ్డారు.
అసలు జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. పేద కుటుంబం ఇల్లు కూల్చడమే లక్ష్యం అన్నట్లు పని చేసిన అధికారులు తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని. . రాజకీయ కక్షలతో వేధించే విష సంస్కృతి వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక ప్రజా సమస్య పరిష్కారం కోసం పని చేసి ఉంటే బాగుండేదన్నారు.
ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో హనుమంత రాయుడు, అతడి భార్య అనితాలక్ష్మీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంపై ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. గళం లేని వారని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చేయాలని.. వారిని వేదనకు గురిచేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Common Man is Suffering in Andhra Pradesh…
Dalit couple Hanumantha Rayudu and his wife Anitha Lakshmi live on a small plot of land in Nijavalli village in Kundurpi Tehsil of erstwhile Anantapur district. (1/2) pic.twitter.com/1x2Nxd3Pqy— Telugu Desam Party (@JaiTDP) May 8, 2022
Pawan Kalyan: పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు.. జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా?