Site icon NTV Telugu

బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు బుజ్జగింపులు !

నిన్నటి నుంచి ఏపీ టీడీపీ పార్టీలో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహణలోనే లోపాలున్నాయని, పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడిని అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి రాజీనామాపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని కూడా అన్నారాయన. దీంతో పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు… టీడీపీ సీనియర్‌ నేతలు చినరాజప్ప, జవహర్‌ స్వయంగా బుచ్చయ్య చౌదరిని కలిసి మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి కాస్త మెత్తబడినట్టే కనిపిస్తున్నారు. అయితే… బుచ్చయ్య చౌదరి వ్యవహారం పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Exit mobile version