Site icon NTV Telugu

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు: చంద్రబాబు


2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని ఎద్దేవా చేశారు.

Read Also: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమన్నారు. పేద వర్గాలు, కోవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా ఈ బడ్జెట్‌లో చెప్పలేదని విమర్శించారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడం సమంజసం కాదని తెలిపారు. విద్యుత్‌ వాహనాలను ప్రోత్స హించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానం బాగుందని చంద్రబాబునాయుడు అన్నారు.

Exit mobile version