CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
- ఉండవల్లిలో చంద్రబాబు ఓటు
- ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు
- రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకత
- ఓటును ఆయుధంగా వాడుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు.. ప్రజలే ముందుకు రావాలి
గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చంద్రబాబు సూచించారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థలను ప్రశ్నించే హక్కు లభిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఓటింగ్‌లో పాల్గొనే దేశం భారతదేశమేనని గుర్తుచేసిన ఆయన, బతికున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read
- AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
- AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
- AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
- VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
రాజ్యాంగ దినోత్సవం, పోలింగ్ కలిసి రావడం విశేషం
ఇవాళ రాజ్యాంగ దినోత్సవం కావడం, అదే రోజున పోలింగ్ కూడా జరగడం ప్రత్యేక సందర్భమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి భారతదేశ భవిష్యత్తుకు దిశ, దశ నిర్దేశించారని కొనియాడారు. ప్రాథమిక హక్కులు, విధులను రాజ్యాంగం స్పష్టంగా పొందుపరిచిందని చెప్పారు.
అందరికీ సమాన హక్కు.. ఓటు ఒక ఆయుధం
పేద, ధనిక, మహిళ, పురుషుడనే తేడా లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించారని చంద్రబాబు అన్నారు. ఓటు హక్కు అనేది ఒక ఆయుధమని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ఓటును ఆయుధంగా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
-
Kavya Maran – Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి