Site icon NTV Telugu

Chandrababu : ఆ మరణాలపై ప్రభుత్వం స్పందించాలి

TDP Chief Chandrababu Naidu Fire on YCP Government over Jangareddy Gudem Incident.

జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? ప్రాణాలు పోతున్నా స్పందించరా..? అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారె. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, మృతుల కుటుంబాలకు ను ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. నాణ్యత లేని ఆహారంతోనే నంద్యాల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత గురైన విషయం తెలిసిందే. కుళ్లిన కోడిగుడ్లు పెట్టడం వల్లనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆయన చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version