NTV Telugu Site icon

Chandrababu : ఇలా కూడా చేయ్యొచ్చా..! అన్పించింది..

సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై మాట్లాడేందుకు చిరంజీవి టీం నిన్న సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో సినిమాటోగ్రఫీ మినస్టర్‌గా ఉన్నానని, ఆ తరువాతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్టీఆర్‌ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయ్యొచ్చా.. అన్పించిందని ఆయన మండిపడ్డారు. సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారని వైసీపీ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీపై కక్షతో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వాళ్లపని వాళ్లు చేసుకునే సినిమా వాళ్లలో కూడా చీలికలు తీసుకువస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. సినీ ఇండస్టీలో సమస్యలు సృష్టించి, ఆ సమస్యను పరిష్కరిస్తామనే నెపంతో సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.