NTV Telugu Site icon

Chandrababu: మహానాడులో బాబు బిజీ… నితిన్ గడ్కరీకి బర్త్ డే విషెస్

Babu Gadkari

Babu Gadkari

రాజకీయాల్లో ఎంత బిజీగా వున్న కీలక నేతల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చాలా అలర్ట్ గా వుంటారు. కేంద్రమంత్రులు, ఇతర వీఐపీల జన్మదినోత్సవాలకు విధిగా శుభాకాంక్షలు తెలపడం ఆయనకు అలవాటు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు ఇవాళ. ఆయనకు శుభాకాంక్షలు అందచేశారు చంద్రబాబు. అదేం పెద్ద వార్తా అని కామెంట్ చేయవద్దు, టీడీపీ పండుగ మహానాడు ఇవాళ, రేపు వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ మ‌హానాడు వేడుక‌ల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి బిజీ షెడ్యూల్‌లోనూ ఆయ‌న బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బర్త్ డే విషెస్ తెలిపారు.

ట్విట్టర్ వేదిక‌గా నితిన్ గడ్కరీకి చంద్రబాబు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా…ఏపీ ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన నితిన్ గడ్కరీతో కలిసి వున్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ ఓ వేదిక మీద క‌లిసి కూర్చున్న ఫొటోను చంద్రబాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ప్రజ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు గ‌డ్కరీకి మ‌రింత మేర అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్డీయేతో కలిసి వున్నప్పుడు కూడా అనేకసార్లు చంద్రబాబు గడ్కరీతో భేటీ అయ్యారు. ఆయనకు అనేక లేఖలు కూడా రాశారు.

Somireddy ChandramohanReddy: జగన్ హయాంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం