Site icon NTV Telugu

Chandrababu : ఏపీని పునః నిర్మించాల్సిన అవసరం ఉంది

నేను.. తెలుగుదేశం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునఃనిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరుపున లాభాలు పొందిన వ్యక్తి సీపీఐ నారాయణ అని, నన్ను ఎప్పుడు విమర్శించారు… ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నేను ప్రతి విమర్శ చేయలేకుండా సద్విమర్శగా తీసుకున్నానన్నారు. చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్త. ఒకే వ్యక్తి ఒకే పార్టీ కంభంపాటి రాంమోహన్‌ అని, చాలా మంది దగ్గర ఉంటే శత్రువులు అవుతారు కానీ… కంభంపాటి అలా కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కంభంపాటి రాంమోహన్ ఎన్నో పదవులు నిర్వహించారని, ప్రతీ ఒక్కరికి ఒక వ్యాపారమో, ఇల్లు గడిచే విధంగా ఉంటే బాగుంటుందని నేను ఎప్పుడు చెబుతానన్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుందని, రేపు 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుపుకుంటామన్నారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు రాబోయే సంవత్సరంలో ఉంటుందన్నారు. ప్రజల మేలు కోసం మేము పని చేస్తామని, సీపీఐ నారాయణ సిద్ధాంతాల కోసం పని చేస్తారన్నారు. రాజకీయాల్లో వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా… అప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలకే ఓటు వేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి తీసిందన్నారు.

Exit mobile version